Do you know Navanandi temples stories


నవనంది ఆలయాల చరిత్ర గురించి మీకు తెలుసా ?
నవనందులు:
1.ప్రథమ నంది: నందుల్లో మొదటిది ప్రథమ నంది. ఇది చామకాల్వ ఒడ్డున, నంద్యాల రైల్వే స్టేషన్ కు సమీపాన ఉంది. సూర్యాస్తమ సమయాల్లో(కార్తీక మాసంలో) నందీశ్వరుని మీద సూర్య కిరణాలు పడటం ఇక్కడ విశేషం.

2.నాగ నంది: నంద్యాల బస్ స్టాండ్ కు సమీపాన ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో నాగ నంది కొలువై ఉంటాడు. నాగులు గరుత్మంతుని ధాటికి తట్టుకోలేక ఇక్కడే శివుని కోసం తపస్సు చేశాడు.

3.సోమ నంది: సోమ నంది నంద్యాల కు తూర్పు వైపున (ఆల్మోస్ట్ నంద్యాల పట్టణానికి లోపల) జగజ్జనని ఆలయానికి సమీపంలో ఉంది. చంద్రుడు (సోముడు) ఈశ్వరుని కోసం ఇక్కడే తప్పసు చేసాడు.

4.సూర్య నంది: సూర్య నంది నంద్యాల నుండి మహానందికి వెళ్లే మార్గంలో రోడ్డు పై ఉన్నది. సరిగ్గా చెప్పాలంటే నంద్యాల నుండి 4 కి. మీ. దూరం వెళితే యు. బొల్లవరం అనే గ్రామం వస్తుంది. అక్కడి నుంచి కుడి వైపు తిరిగి కిలోమీటరు దూరం వెళితే ఈ ఆలయానికి చేరుకోవచ్చు. రోజూ సూర్యకిరణాలు లింగం పై పడటం ఇక్కడి విశేషం.

5.శివ నంది: శివ నంది కూడా నంద్యాల నుండి మహానంది కి వెళ్లే మార్గంలో ఉంటుంది. నంద్యాల నుండి సుమారు 13 కి. మీ. దూరంలో తిమ్మవరం గ్రామం దాటినాక ఎడమవైపున ఉంటుంది. కడమల కాల్వా ల్యాండ్ మార్క్ గా చెప్పవచ్చు. ఇది మిగిలిన 8 నంది ఆలయాల కంటే పెద్దది. అరణ్యంలో ఉంటుంది కనుక ప్రశాంతంగా ఉంటుంది.

6.విష్ణు లేదా కృష్ణ నంది : మహానంది రోడ్డు మార్గంలో, మహానంది ఇంకా రాకమునుపే 2 మైళ్ళ ముందర ఎడమ వైపు తిరిగితే తెలుగు గంగ కెనాల్ కనిపిస్తుంది. ఆ కెనాల్ ను ఆనుకొని ఉన్న మట్టి రోడ్డు గుండా 4 కి. మీ. వెళితే విష్ణు ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ శ్రీహరి శివుణ్ని ప్రార్ధించాడట. ఆలయంలోకి వచ్చి పోయే నీరు, పాలరాతి నంది విగ్రహం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది.

7.గరుడ నంది: నంద్యాల నుండి మహానందికి వెళ్ళటప్పుడు, మహానంది గుడికి ముందర కొద్ది దూరంలో ... పెద్ద నంది విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహాన్ని దాటితే గరుడ నందిని దర్శించుకోవచ్చు. గరుత్మంతుని తల్లి వినతాదేవి తను వెళ్ళే పనిలో ఎటువంటి ఆటకం కలగకుండా ఉండేందుకై పరమేశ్వరుణ్ణి ప్రార్ధించిన ప్రదేశమిది.

8.మహానంది : మహానంది లోనిది స్వయంభూలింగం. ఆలయంలోకి ప్రవేశించేముందు భక్తులు ఇక్కడి పవిత్ర కొలనులలో మునిగితేలుతారు. కొలను లోని నీరు 5 అడుగుల మేర లోతు ఉంటుంది. నీరు స్వచ్చంగా ఉండి, వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది. సెలవు దినాల్లో, పండుగల సమయాల్లో జనం అధికంగా వస్తారు కాబట్టి మిగితా సమయాల్లో వెళితే బాగుతుంది.

9.వినాయక నంది : వినాయక నంది చిన్న ఆలయం. ఇది మహానంది ఆలయానికి వాయువ్య దిక్కున ఉంటుంది. ఆలయ గోపురం దాటి బయటకు వచ్చిన తరువాత ఎడమ పక్కన, కోనేటి గట్టున ఉంటుంది. పూర్వం వినాయకుడు ఇక్కడ తపస్సు చేసినాడని వినికిడి.

 

2018 © Prudwi.com. All Rights Reserved. A Unit of Vasundara Info Solutions Pvt Ltd